Thimmamma Marrimanu: శ్రీసత్యసాయి జిల్లా నంబుల పూలకుంట వద్ద.. ఏడు ఎకరాలలో విస్తరించిన తిమ్మమ్మ మర్రిమాను, తిమ్మమాంబ ఆలయాన్ని.. దేవదాయ శాఖ పరిధిలోకి తీసుకోవద్దంటూ గ్రామస్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అతి పెద్ద మర్రిమాను విస్తరించిన ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న కోరికతో.. స్థానికులు సొంత భూములను ప్రభుత్వానికి అప్పగించారు. మర్రిమాను సంరక్షణను పట్టించుకోని ప్రభుత్వం.. దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ.. స్థానికులు రెండో రోజు నిరసనలు చేపట్టారు. వీరికి జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు.
'అభివృద్ధి చేస్తారని భూములిస్తే.. ఇలా చేస్తారా..!'
Thimmamma Marrimanu: తమ ప్రాంతం గొప్ప పర్యాటక కేెంద్రంగా మారుతుందని భూములిస్తే.. ఇప్పుడు దేవాదాయశాఖ తీసుకోవడం ఏంటని నంబుల పూలకుంట గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో రోజు వారు చేపట్టిన నిరసనలకు జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు.
నంబుల పూలకుంట గ్రామస్తులు