ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీవో నెం.1పై రేపు నిరసనలకు సీపీఐ పిలుపు - GO number 1

CPI Secretary Ramakrishna: జీవో నెంబర్ 1ను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమాలకు.. సిపిఐ కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. అర్ధాంతరంగా ఆగిపోయిన టిట్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని.. డిమాండ్ చేశారు.

ramakrishna
ramakrishna

By

Published : Jan 25, 2023, 10:30 PM IST

CPI Secretary Ramakrishna: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కోటిపి గ్రామం వద్ద ఉన్న టిడ్కో భవన సముదాయాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. రోడ్డుమీద నడవాలంటే కూడా పోలీసుల అనుమతి తీసుకోవాలని.. తీసుకొచ్చిన జీవో నెం.1ను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల ముందు ప్రతిజ్ఞతో కూడిన నిరసన కార్యక్రమాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

అర్ధాంతరంగా ఆగిపోయిన టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. జగనన్న లేఅవుట్లలో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక సిమెంటును ఉచితంగా ఇస్తూ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details