ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హిందూపురంలో వైసీపీ ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా కౌన్సిలర్ల నిరసన - హిందూపురం న్యూస్

YCP Councillors Protest: వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వైఖరిపై స్థానిక కౌన్సిలర్లు అసమ్మతి ప్రకటించారు. ఎమ్మెల్సీ.. తనకు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని.. కౌన్సిలర్లను సంప్రదించకుండానే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Councillors protest
కౌన్సిలర్ల నిరసన

By

Published : Dec 30, 2022, 10:00 PM IST

YCP Councillors Protest: వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్.. తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ కౌన్సిలర్లు మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. హిందూపురంలో సచివాలయ కన్వీనర్ల ఎంపిక ప్రక్రియలో తమ ప్రమేయం లేకుండా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్.. తనకిష్టం వచ్చిన వారిని ఎన్నుకున్నారని.. అసమ్మతి వర్గం ఆరోపించింది. తాము కౌన్సిలర్లుగా గెలిచి రెండేళ్లు అవుతున్నా.. ఎటువంటి అధికారిక కార్యక్రమాలకు పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details