ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు సత్యసాయి జిల్లాలో సీఎం జగన్ పర్యటన - cm jagan today tour

CM Jagan Tour: నేడు సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. 2021 ఏడాదిలో ఖరీఫ్‌ పంటల బీమా పరిహారం చెల్లింపునకు సంబంధించి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.

jagan Tour
jagan Tour

By

Published : Jun 14, 2022, 6:37 AM IST

Updated : Jun 14, 2022, 7:08 AM IST

ముఖ్యమంత్రి జగన్ నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. 2021 ఏడాదిలో ఖరీఫ్ పంట నష్టపోయిన 15.61 మంది రైతుల ఖాతాల్లో పంట బీమా డబ్బుల్ని జమ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లాలోని చెన్నేకొత్తపల్లికి చేరుకుంటారు. అక్కడినుంచి రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని ఎలక్ట్రానిక్ విధానంలో మీట నొక్కి సీఎం విడుదల చేయనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్​ పాల్గొంటారు. ఆ తరువాత రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పంటల బీమా మెగా చెక్‌ను రైతులకు అందించనున్నారు. మధ్యాహ్నం 1గంట తరువాత తిరుగు ప్రయాణం అవుతారు. ఈ నేపథ్యంలో తమ గోడు విని కష్టాలను గట్టెక్కించేలా వరాలు ఇవ్వాలని రెండు జిల్లాల ప్రజలు, రైతులు వేడుకుంటున్నారు.

రెండేళ్లుగా అధికవర్షాలు అన్నదాతకు కన్నీళ్లనే మిగిల్చాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందకపోతే పడే బాధ వర్ణనాతీతం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే ‘భరోసా’ కర్షకుడికి దన్నునివ్వడం లేదు. నిబంధనల అడ్డుగోడల వల్ల సాయం ప్రతి రైతు వద్దకు చేరడం లేదు. కౌలు రైతు పరిస్థితి మరింత దయనీయం. ‘రాయితీ’లు అందక రైతు గుండెలు అవిసిపోతున్నాయి. ‘పెట్టుబడి సాయం’ కోసం ఏళ్లుగా ఎదురుచూపులు. ‘పంటల బీమా’ అందరికీ ధీమాను ఇవ్వడం లేదు. హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు నిలిచిపోయాయి. ఎన్నో ఆకాంక్షలతో పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా ఏర్పడింది. కొత్త జిల్లాలో పరిపాలన ఇంకా గాడిలో పడలేదు. దీనికి ప్రధాన కారణం నిధుల లేమి. అత్యంత ప్రాధాన్య అంశాల్లోనూ నిధులు లేక పనులు ముందుకు సాగడం లేదు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే తమరు కరుణిస్తే కష్టాలు తీరుతాయని జిల్లావాసులు ముఖ్యమంత్రికి మొరపెట్టుకుంటున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో తమ గోడు విని కష్టాలను గట్టెక్కించేలా వరాలు ఇవ్వాలని రెండు జిల్లాల ప్రజలు, రైతులు వేడుకుంటున్నారు.

అనంతపురం జిల్లాకు ముఖ్యమంత్రి మూడోసారి వస్తున్నారు. గతంలో జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. హంద్రీనీవా కాలువ వెడల్పు చేసి ఆరువేల క్యూసెక్కులకు పెంచుతూ, మరో నాలుగు వేల క్యూసెక్కుల సామర్థ్యంతో సమాంతర కాలువ తవ్వుతామని హామీ ఇచ్చారు. దీనిలో ఏ ఒక్కపని ప్రారంభించలేదు. 2020 డిసెంబర్ 9న సీకే పల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేయగా, సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి వర్చవల్ విధానంలో పేరూరు సమాంతర కాలువ, మూడు ప్రాజక్టులకు శంఖుస్థాపన చేసారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఈ పనులకు రూ.803 కోట్లు విడుదల చేసి 30 శాతం పనులు చేశారు. అదే మొత్తంతో తాము నాలుగు ప్రాజక్టులు కూడా కడతామని అప్పట్లో ఆర్బాటంగా ప్రకటించిన సీఎం గంప మట్టికూడా ఎత్తటానికి నిధులివ్వలేదు. ప్రస్తుతం అక్కడే మళ్లీ వేదికమీదకు వస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు బీమా సొమ్ము ఖాతాల్లో జమచేస్తూ శ్రీసత్యసాయి జిల్లాలో వేదికపై మీటనొక్కనున్నారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో గతంలో సీఎం ఇచ్చిన హామీ ఒక్కటీ నెరవేరలేదు. గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి పరిటాల సునీత కృషితో జీడిపల్లి నుంచి పేరూరు జలాశయానికి 53 కిలోమీటర్ల సమాంతర కాలువ, పుట్టకనుమ, సోమవాండ్ల పల్లి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వార్లు మంజారు చేశారు. దీనికోసం అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు 803 కోట్లు విడుదల చేయగా, ఎన్నికల సమయానికి 30 శాతం పనులు పూర్తిచేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక, ఈ కాలువకు ఇంత ఖర్చుకాదని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి నానా యాగీ చేశారు. ఇదే మొత్తంతో నాలుగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మిస్తామని చెప్పారు. ఆమేరకు ముందు ప్రభుత్వం మంజూరు చేసి, సర్వే పూర్తైన పుట్టకనుమను రద్దు చేయించి, సోమవాండ్ల పల్లితో పాటు ముట్టాల, దేవరకొండ, తోపుదుర్తిలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. 2020 డిసెంబర్ 9న సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి సీకే పల్లి బహిరంగసభ వేదికపై శిలాఫలకాన్ని ఆవిష్కరించి ఈ ప్రాజెక్టులకు భూమిపూజ చేశారు. అంతే అప్పటి నుంచి ఈ ప్రాజక్టుల పనుల్లో ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తినపాపానపోలేదు.

హంద్రీనీవా పరిస్థితి అంతే. గతంలో కాంగ్రెస్, తెదేపా ప్రభుత్వాలు 2600 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ నిర్మించి శ్రీశైలం నుంచి జీడిపల్లికి నీరు తీసుకువచ్చారు. ఈ కాలువను వెడల్పు చేసి సామర్థ్యాన్ని ఆరు వేల క్యూసెక్కులకు పెంచటమే కాకుండా, మరో నాలుగువేల క్యూసెక్కుల సమాంతర కాలువ కూడా తవ్వుతామని సీఎం స్వయంగా హామీ ఇచ్చారు. అంతే అప్పటి నుంచి దీనిగురించి జిల్లాలో వైకాపా ఎమ్మెల్యేలు ఎవరూ నోరు విప్పలేదు, పనులు చేయమని అడగలేదు. దీనికోసం ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇలా ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధి పనుల కోసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయని వైకాపా ప్రభుత్వం, మళ్లీ రైతులకు మేలు చేస్తామంటూ బీమా పరిహారం పంపిణీకి సీఎం వస్తున్నారు. సీఎం పర్యటనపై, నెరవెర్చని హామీలపై తెదేపా నేతలు సోమవారం పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో గత ఏడాది పంటలు నష్టపోయిన రైతులకు రూ.885.53 కోట్ల పరిహారం అందనుంది. రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టానికి బీమా పరిహారాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలక్ట్రానిక్ విధానంలో బటన్ నొక్క రైతుల వ్యక్తిగత ఖాతాలకు జమ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు జిల్లాకు వచ్చే సీఎం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు పర్యటించేలా అధికారులు షెడ్యూల్ చేశారు.

ఇదీ చదవండి:

Last Updated : Jun 14, 2022, 7:08 AM IST

ABOUT THE AUTHOR

...view details