Clashes: శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కల్లూరులో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇంటి స్థలం విషయమై వివాదం ఏర్పడి.. వ్యవసాయ పనిముట్లతో పరస్పరం దాడి చేసుకోవడంతో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. లేపాక్షి మండలం కల్లూరు గ్రామానికి చెందిన చంద్ర, నాగరాజు అనే వ్యక్తుల మధ్య ఇంటి పక్కన ఉన్న స్థలం విషయమై వివాదం నెలకొంది. ఇదే క్రమంలో శనివారం ఉదయం ఘర్షణలకు దారితీసిందని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Clashes: స్థలం కోసం వివాదం.. వ్యవసాయ సామగ్రితో దాడి.. - పెద్దగుడ్డంపల్లిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ
Clashes: శ్రీసత్యసాయి జిల్లాలో వేర్వేరు ఘటనల్లో రెండు చోట్ల ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో ఆరుగురి తీవ్రగాయాలయ్యాయి. ఈ రెండు ఘటనలు స్థల వివాదంలో భాగంగా జరిగినవే అని స్థానికులు తెలిపారు.
ఘర్షణ
హిందూపురం మండలం పెద్దగుడ్డంపల్లిలో భూవివాదంతో వ్యక్తిపై కొందరు కొడవలితో దాడి చేశారు. తీవ్రగాయాలు కావడంతో హిందూపురం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య పరీక్షలకు మంగళం.. రోగుల అవస్థలు వర్ణనాతీతం