Ci Warning to ex Mla B.K Parthasarathy: రేయ్.. అడుగు ముందుకు వేశావంటే కాల్చిపడేస్తానంటూ తెదేపా మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిని సీఐ చిన్నగౌస్ బెదిరించిన వీడియో వైరల్ అవుతోంది. కుప్పంలో వైకాపా నేతల దాడులపై ఆందోళనకు వెళుతున్న మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిలను శ్రీసత్యసాయి జిల్లా రామగిరిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ తెదేపా శ్రేణులతో కలిసి పరిటాల సునీత, పార్థసారథిలు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పార్థసారథికి సీఐ చిన్నగౌస్ కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సీఐ చిన్నగౌస్ రేయ్ అడుగు ముందుకేయ్ కాల్చిపడేస్తానంటూ పలుసార్లు పార్థసారథిని బెదిరించారు.
ఇవీ చదవండి: