PENNA RIVER : ఎగువ ప్రాంతమైన కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు తోడు శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పెన్నా నది వరద నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పోచంపల్లి గ్రామ సమీపంలోని పెన్నా నదిపై వంతెన కూలిపోయింది. పోచంపల్లి, బెవనహళ్లితో పాటు మరో 10 గ్రామాలకు హిందూపురం పట్టణంతో రాకపోకలు స్తంభించాయి. అధికారులు త్వరగా బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
పెన్నానదిపై కూలిన వంతెన.. 12గ్రామాలకు స్తంభించిన రాకపోకలు - పెన్నానదిపై కూలిన వంతెన
BRIDGE COLLAPSED : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు హిందూపురంలోని పెన్నానది పరవళ్లు తొక్కుతోంది. దీంతో మండలంలోని పోచంపల్లి సమీపంలోని పెన్నానదిపై వంతెన కూలిపోయింది.
BRIDGE COLLAPSED