Bears Wandering in Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని జీరిగేపల్లి గ్రామ శివారులో ఉన్న అమ్మాజీ ఆలయంలో రెండు ఎలుగుబంట్లు సంచరించాయి. ఈ దృశ్యాలు గుడిలో ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యాయి. దీంతో భక్తులు, ఆ గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ శివారులో ఉన్న అమ్మాజీ దేవాలయంలో భక్తులు రోజు పూజలు నిర్వహిస్తారు. ఎలుగుబంట్ల సంచారంతో ప్రజలు, ఆ గుడికి వెళ్లే భక్తులు ఆందోళన చెందుతున్నారు.
సత్యసాయి జిల్లాలో ఎలుగుబంట్ల సంచారం.. ఆందోళనలో ప్రజలు - గుడి
Bears: శ్రీ సత్యసాయి జిల్లాలోని జీరిగేపల్లి గ్రామంలో ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. రాత్రిపూట వీటి సంచారం అధికంగా ఉందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రామ శివారులోని అమ్మాజీ ఆలయంలో ఎలుగుబంట్లు సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఎలుగుబంట్ల సంచారం
గతంలో గ్రామస్థులపై ఎలుగుబంట్లు దాడి చేసిన ఘటనలున్నాయి. ఇప్పుడు మళ్లీ వీటి సంచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వన్యప్రాణుల బెడద నుంచి తమను కాపాడాలని గ్రామస్థులు అటవీ శాఖ అధికారులను వెేడుకుంటున్నారు.
ఇవీ చదవండి: