ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ వైసీపీ నేతను మంత్రి పదవి తొలగించినందుకేనా..? ఈ పొట్టేళ్ల విందు..! - ఏపీలో పొట్టేళ్ల విందు వార్తలు

YSRCP leaders celebrate: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అసమ్మతి వర్గాల నేతలు బలిచ్చి విందు ఏర్పాటు చేయడం నియోజకవర్గంలో చర్చజరుగుతుంది. మంత్రి వర్గ విస్తరణలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నారాయణ మంత్రి పదవి తొలగించినందుకే పొట్టేళ్లును బలిచ్చారని ప్రచారం సాగుతుంది. త్వరలో నియోజకవర్గంలోని మరి కొంతమంది నేతలను పార్టీ నుంచి తొలగిస్తారని చర్చ జరుగుతోంది.

YCP leaders celebrate
వైసీపీ నేతల పొట్టేళ్ల విందు

By

Published : Jan 17, 2023, 10:50 PM IST

Penukonda MLA Shankar Narayana: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అసమ్మతి వర్గాల నేతలు కర్ణాటకలోని బాగేపల్లి సమీపంలో గల బాట సుంకులమ్మ దేవాలయం వద్ద పొట్టేళ్లను బలిచ్చి విందు ఏర్పాటు చేయడం చర్చనీయాశంగా మారింది. మంత్రి వర్గ విస్తరణలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నారాయణ మంత్రి పదవి తొలగించినందుకే పొట్టేళ్లు బలిచ్చారని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. వాయిదాలు పడుతూ వచ్చిన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహించినట్లు సమాచారం. అసమ్మతి వర్గం నేతల్లో పెనుకొండ మండలానికి చెందిన కర్ర సంజీవరెడ్డిని పార్టీ నుంచి తొలగించినట్లు తొలగించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో మరి కొంతమంది నేతలను పార్టీ నుంచి తొలగిస్తారని చర్చ జరుగుతోంది.

పొట్టేళ్లును బలిచ్చారని నియోజకవర్గంలో చర్చ

ABOUT THE AUTHOR

...view details