ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Balayya Fans Protest: హిందూపురంలో వీరసింహరెడ్డి 100 రోజుల వేడుక.. అధికారుల అనుమతి నిరాకరణ - వీరసింహారెడ్డి సినిమా 100 రోజులు

Balayya Fans Protest: నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా 100 రోజుల వేడుకను.. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నిర్వహించేందుకు అధికారులు అనుమతి నిరాకరించటంతో.. బాలయ్య అభిమానులు ఆందోళనకు దిగారు.

Balayya Fans Protest
Balayya Fans Protest

By

Published : Apr 20, 2023, 2:05 PM IST

Balayya Fans Protest: నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సూపర్​ హిట్​ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య అభిమానులు సినిమా 100 రోజుల కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నిర్వహించేందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో బాలయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు.

వీరసింహారెడ్డి సినిమా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 23వ తేదీన హిందూపురం పట్టణంలోని ఎంజీఎం పాఠశాల క్రీడా మైదానంలో పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు జరపాలని అభిమానులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకునేందుకు అనుమతి కోసం మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించగా అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో బాలయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన నిర్వహించారు. రాజకీయ దురుద్దేశంతో, అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకే మున్సిపల్​ అధికారులు స్థల కేటాయింపును నిరాకరిస్తున్నారని ఆరోపించారు.

మున్సిపల్ కమిషనర్ ఛైర్ పర్సన్ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించారు. ఎంతసేపటికి అధికారులు స్పందించకపోవడంతో హిందూపురం లేపాక్షి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వెంటనే వంద రోజుల కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని లేకపోతే ఉద్యమానికి ఉగ్రరూపం దాలుస్తామని బాలయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధికారులను హెచ్చరించారు.

అఖండ తర్వాత అదే రేంజ్​లో ఫుల్​జోష్​తో వచ్చిన బాలయ్య సినిమా 'వీరసింహా రెడ్డి'. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నందమూరి బాలకృష్ణ అభిమానులకు సంక్రాంతికి ముందే పండుగ వచ్చింది. జనవరి 12 'వీరసింహారెడ్డి' ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద ఊర మాస్​ సెలబ్రేషన్స్‌ షురూ అయ్యాయి. బాలయ్య విశ్వరూపాన్ని చూసేందుకు చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజాము నుంచే నందమూరి అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరారు.

అలా ఇప్పటికే ఎన్నో అంచనాలతో రిలీజైన ఈ సినిమా తొలి రోజే 54 కోట్ల రూపాయల గ్రాస్​ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్​ అధికారికంగా తెలిపింది. 'బాలయ్య బాబు బాక్సాఫీస్ ఊచకోత' అనే క్యాప్షన్ కూడా జోడించింది. బాలయ్య అభిమానులను దృష్టిలో ఉంచుకుని గోపిచంద్​ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య రోర్​ మాములుగా లేదంటున్నారు అభిమానులు. జై బాలయ్య అన్న నినాదంతో థియేటర్లు దద్దరిల్లిపోయాయనే చెప్పాలి. ఇక బాలయ్య అటు యాక్షన్​తో పాట ఇటు సెంటిమెంట్​ను బ్యాలెన్స్​ చేసి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించారు.​ ఈ సినిమాలో నటించిన ఇతర తారలు సైతం తమదైన శైలిలో నటించి సీన్స్​ పండించారు. ఈ నేపథ్యంలోనే సినిమా 100 రోజుల సెలబ్రేషన్స్​ జరుపుకోవాలని నిర్ణయించిన అభిమానులు హిందూపురంలో వేడుకల చేయాలని చూడగా అందుకు అనుమతి నిరాకరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details