Ambulance bills: విపత్కర సమయంలో తమతో సేవలు చేయించుకొని రెండు సంవత్సరాలుగా బిల్లుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రైవేట్ అంబులెన్సుల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ తమకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. ఇక తాము బిల్లులపై ఆశలు వదులుకున్నామని అసహనం వ్యక్తం చేశారు.
2020 సంవత్సరంలో కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో హిందూపురం తహసీల్దార్, ఆర్టీవో అధికారులు ప్రైవేట్ అంబులెన్స్ సేవలను వినియోగించుకున్నారు. ఆ సమయంలో అధికారులు ప్రభుత్వం నుండి మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని... బిల్లులు వెంటనే మంజూరయ్యేలా చూస్తామని అంబులెన్స్ నిర్వాహకులకు చెప్పి వారి సేవలను వినియోగించుకున్నారు. అనంతరం వారికి రావాల్సిన 11 లక్షల బకాయిలలో కేవలం ఐదు లక్షలు చెల్లించి చేయి దులుపుకున్నారు.
2020లో కరోనా సమయంలో అంబులెన్సులు పెట్టాము. 11 లక్షల పైగా బిల్లు అయింది. ఐదు లక్షల 21వేల ఏడు వందలు ఇచ్చారు. ఇంకా ఆరు లక్షల 50 వేల 800 రూపాయలు రావాలి వాటి కోసం కార్యాలయాల కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాము.- తౌసిఫ్, ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకుడు