NOTICE: శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పోలీసులకు ఏపీ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది. కదిరిలోని ఓ లాడ్జి కొనుగోలు వ్యవహారంలో యజమానికి, కొనుగోలుదారుల మధ్య వివాదం తలెత్తింది. తాము కొనుగోలు చేసిన మూడు వాటాలను అప్పగించాలంటూ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి స్థానిక వైకాపా నాయకుల సహకారంతో గత నెల 23న లాడ్జి వద్ద దౌర్జన్యానికి దిగారు. ఎస్ఐ, సిబ్బంది అక్కడికి వచ్చినా... దౌర్జన్యం చేస్తున్న వారికి అనుకూలంగానే వ్యవహరించారని లాడ్జి యజమాని జొన్న రామయ్య మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదును పరిశీలించిన కమిషన్ చైర్మన్.. కదిరి అర్బన్ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. బాధితుడికి అండగా నిలవడంలో నిర్లక్ష్యానికి గల కారణాలను వివరిస్తూ ఈనెల 26 లోపు సమాధానం చెప్పాలని నోటీసులిచ్చారు.
NOTICES: కదిరి పోలీసులకు ఏపీ మానవ హక్కుల కమిషన్ నోటీసులు.. ఎందుకంటే? - సత్యసాయి జిల్లా తాజా వార్తలు
NOTICE: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పోలీసులకు ఏపీ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది. కదిరిలోని ఓ లాడ్జి కొనుగోలు వ్యవహారంలో యజమానికి, కొనుగోలుదారుల మధ్య వివాదం తలెత్తింది. దౌర్జన్యం చేస్తున్న వారికి పోలీసులు అనుకూలంగానే వ్యవహరించారని లాడ్జి యజమాని జొన్న రామయ్య మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌ను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదును పరిశీలించిన కమిషన్ ఛైర్మన్ కదిరి అర్బన్ పోలీసులకు నోటీసులు జారీ చేశారు.
ఇదీ జరిగింది...:కదిరిలోని జొన్నా లాడ్జిలోని మూడు వాటాలను అనంతపురానికి చెందిన శ్రీధర్ రెడ్డి కొనుగోలు చేశారు. అయితే లాడ్జిలో మరో రెండు వాటాలు కలిగిన యజమాని జొన్న రామయ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాము కొనుగోలు చేసిన మూడు వాటాలను అప్పగించాలంటూ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి స్థానిక వైకాపా నాయకుల సహకారంతో గత నెల 23న లాడ్జి వద్ద దౌర్జన్యానికి దిగారు. టిప్పర్ లారీ సహాయంతో బండరాళ్లను తీసుకొచ్చి లాడ్జికి వెళ్లే దారిని మూశారు. సుమారు 300 మంది వైకాపా కార్యకర్తలు, నాయకులు అక్కడికి చేరుకుని భయబ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించారు. అడ్డుకోబోయిన యజమాని రామయ్యను బలవంతంగా ఎత్తుకెళ్లి ఓ మూలన పడేశారు. ఈ విషయమై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన రీతిలో స్పందించలేదని జొన్న రామయ్య మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌ను ఆశ్రయించారు.