ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఫిర్యాదుకు వచ్చిన బాధితుడిపై దాడి.. ఎస్‌ఐను వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు

By

Published : May 3, 2022, 4:33 PM IST

సత్యసాయి జిల్లాలో ఫిర్యాదుకు వచ్చిన బాధితుడిని చితకబాదిన ఘటనలో.. ఎస్‌ఐపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ​ఎస్​ఐ రంగడును వీఆర్‌కు పంపుతూ అనంతపురం రేంజ్‌ డీఐజీ రవిప్రకాశ్‌ ఆదేశాలు జారీ చేశారు.

police
police

శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు ఎస్‌ఐ రంగడును వీఆర్‌కు పంపుతూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుకు వచ్చిన బాధితుడిని చితకబాదిన ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో అనంతపురం రేంజ్‌ డీఐజీ రవిప్రకాశ్‌.. ఎస్‌ఐను వీఆర్‌కు పంపుతూ ఆదేశాలిచ్చారు. మరోవైపు పీఎస్‌లో దాడి చేసిన ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని తెదేపా జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాసింది.

జరిగింది ఇదీ..

సత్యసాయి జిల్లా చిలమత్తూర్ మండలం, సంజీవరాయనిపల్లిలో దివ్యంగురాలైన పద్మావతికి పెన్షన్ రాలేదు. ఈ విషయమై అడగటానికి స్థానిక వైకాపా నాయకుడు దామోదర్ రెడ్డి వద్దకు పద్మావతి కుమారుడు వేణు వెళ్లాడు. అయితే.. శుక్రవారం సాయంత్రం ఈ విషయమై సంజీవరాయ పల్లిలో దామోదర్ రెడ్డి, వేణు మధ్య ఘర్షణ జరిగింది. కాగా.. దామోదర్ రెడ్డి తనపై దాడి చేసి కొట్టాడని, రివర్స్​లో తనపైనే పోలీసులకు ఫిర్యాదు చేశాడని బాధితుడు వేణు వాపోయాడు. అయితే.. వేణు పోలీసులు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా చిలమత్తూర్ ఎస్ఐ దుర్భాషలాడుతూ వేణుపైనే దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఇదీ చదవండి :జగన్ రెడ్డి గారూ... ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా..!! -లోకేశ్

ABOUT THE AUTHOR

...view details