All Party Leaders Protest : లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను రైతులకు తిరిగి ఇవ్వాలన్న డిమాండ్‌తో తలపెట్టిన రిలే నిరాహార దీక్షలకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట అఖిలపక్షాల నేతలు ఆందోనళకు దిగారు. ఠాణా ఎదుట బైఠాయించి.. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిలమత్తూరు మండలంలోని.. లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల్లో పరిశ్రమలైనా స్థాపించాలి లేదా రైతులకు భూముల్ని తిరిగి ఇవ్వాలన్న డిమాండ్‌తో.. హిందూపురంలో అఖిలపక్షాల నాయకులు.. ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. ఈ నెల 19 నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాలని... అనుమతి కోసం పోలీసుల వద్దకు వెళ్లగా... వారు నిరాకకరించారు. దీంతో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి.. అఖిలపక్షాల నేతలు ఆందోళనకు దిగారు.
లేపాక్షి భూములు రైతులకివ్వాలి.. హిందూపురం పీఎస్ ఎదుట అఖిలపక్ష నేతల ఆందోళన - లేపాక్షి నాలెడ్జ్ హబ్
All Party Leaders Protest : హిందూపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట అఖిలపక్షాల నేతలు ఆందోళనకు దిగారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల విషయంలో రిలే నిరాహార దీక్షలకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో నేతలు నిరసన బాట పట్టారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరం ఏర్పాటు చేసి ఆందోళన చేపట్టి తీరతామని.. అఖిలపక్షాల నేతలు స్పష్టం చేశారు.
అఖిలపక్షాల నేతల ఆందోళన
హిందూపురం వన్‌టౌన్ సీఐ ఆందోళనకారులతో చర్చలు జరిపినా.. ఫలితం లేకపోయింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు... దీక్షలకు అనుమతి ఇచ్చేది లేదని సీఐ తేల్చిచెప్పారు. పోలీసులు అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా... లేపాక్షి నాలెడ్జ్ హబ్ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరం ఏర్పాటు చేసి ఆందోళన చేపట్టి తీరతామని అఖిలపక్షాల నేతలు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి:
TAGGED:
All Party Leaders Protest