ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివాహేతర సంబంధం.. ముగ్గురు పిల్లలను వదిలేసి జంప్.. కానీ చివరికి

Agitation With Dead Body: శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని పార్థసారథి కాలనీలో.. యువకుడి ఇంటి ఎదుట యువతి మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. వివాహేతర సంబంధం పెట్టుకొని నాలుగు నెలల కిందట మహేష్, రమాదేవి ఇంటి నుంచి వెళ్లిపోయారు. కాగా ప్రమాదం జరిగి.. ఆమె హైదరాబాద్​లో మరణించింది. రమాదేవి మృతి గురించి కుటుంబ సభ్యులకు.. మహేష్ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

Agitation With Dead Body
వివాహేతర సంబంధం

By

Published : Mar 16, 2023, 7:20 PM IST

Agitation With Dead Body: ఆవిడకి పెళ్లైంది.. ముగ్గురు కుమార్తెలున్నారు.. ఏడాది కిందట భర్త మృతి చెందడంతో తల్లిదండ్రుల వద్దకు చేరింది. కుమార్తెలకు మంచీ చెడులు చెప్పాల్సిన ఆవిడే.. బాధ్యత మరచింది.. దారి తప్పింది. వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి కూడా అప్పటికే వేరే మహిళతో పెళ్లి అయింది.

వీరిద్దరి విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది.. అందరూ మందలించారు. అయినాసరే వారిలో మార్పు రాలేదు. ఈసారి ఏకంగా వేరే ప్రాంతానికే వెళ్లిపోయారు. కానీ.. ఇక్కడే వారు అనుకోనిది ఒకటి జరిగింది. ఆ మహిళకు ప్రమాదం జరిగింది. దీంతో ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి సైలెంట్​గా ఇంటికి వచ్చేశాడు. ఆసుపత్రిలో ఉన్న ఆ మహిళ మృతి చెందింది.

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో పార్థసారథి కాలనీలో.. ఓ వ్యక్తి ఇంటి ఎదుట మహిళ మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. పార్థసారథి కాలనీకి చెందిన హనుమంతు, అంజనమ్మ దంపతుల కుమార్తె రమాదేవిని అమడుగూరు మండలంలోని ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఏడాది కిందట రమాదేవి భర్త మృతి చెందడంతో.. తన ముగ్గురు కుమార్తెలతో ఆమె పార్థసారథి కాలనీలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చింది.

రమాదేవి, మృతురాలు

రమాదేవి తన ముగ్గురు కుమార్తెలను హాస్టల్లో చేర్పించి.. తల్లిదండ్రులతో పాటు ఉంటోంది. తమ ఇంటికి సమీపంలో ఉన్న మహేష్​తో రమాదేవికి పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలియడంతో మహేష్​ను స్థానికులు మందలించారు.

మహేష్

నాలుగు నెలల కిందట మహేష్, రమాదేవి ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్​లో కాపురం పెట్టారు. గత శనివారం రమాదేవి హైదరాబాద్​లో ప్రమాదానికి గురైంది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించిన మహేష్.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే కదిరికి వచ్చేశాడు. తరువాత రమాదేవి పరిస్థితి విషమించి ఆసుపత్రిలోనే మృతి చెందారు.

రమాదేవి వద్ద లభించిన ఆధారాలతో హైదరాబాద్ పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రమాదేవి మృతదేహాన్ని తల్లిదండ్రులు కదిరికి తీసుకువచ్చి బంధువులతో పాటు.. మహేష్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న కదిరి పట్టణ పోలీసులు.. అక్కడికి చేరుకొని ఇరు కుటుంబ సభ్యులను స్టేషన్​కి తరలించారు.

వివాహేతర సంబంధంతో.. ముగ్గురు పిల్లలను వదిలేసి జంప్.. కానీ చివరికి

"మా అక్క నాలుగు నెలలు నుంచి కనిపించడం లేదు. మా ఇంటి పక్కన ఉండే మహేష్ అనే వ్యక్తి తీసుకొని వెళ్లిపోయ్యాడు. ఎక్కడకు పోయారో తెలియదు. ఆయన ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు.. కానీ మా అక్క ఎక్కడ ఉందో తెలియలేదు. ఈ రోజు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో శవమై ఉంది. పోలీసులు చెప్తే వెళ్లాము. ఈ వ్యక్తి ఆసుపత్రిలో చేర్పించి.. మా అక్క దగ్గర ఉన్న గాజులు, కమ్మలు అన్నీ తీసుకొని వచ్చేశాడు. ఏం జరగలేదు అనే విధంగా వ్యవహరించాడు. మాకు న్యాయం జరగాలి" - సురేష్, మృతురాలి సోదరుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details