Video viral: సినీ నటుడు, హిందూపూర్ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు మాస్‌లో ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల బాలకృష్ణ తన నియోజకవర్గంలో పర్యటించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఓ వాగు వద్ద కూలిపోయిన వంతెనను పరిశీలించేందుకు వెళ్లగా,.. అవతలి వైపు ఉన్న ఓ అభిమాని వాగులో దూకి బాలకృష్ణను కలిసేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడు వాగులో కొంతదూరం కొట్టుకుపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అభిమాని అత్యుత్సాహం.. బాలకృష్ణను కలిసేందుకు ఏం చేశాడంటే.. వీడియో వైరల్ - బాలకృష్ణను కలిసేందుకు అభిమాని ఏం చేశాడంటే
Fan jumped into River: మితిమీరిన అభిమానం ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంది. తన అభిమాన నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ మధ్య హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఓ వాగు వద్ద కూలిపోయిన వంతెనను పరిశీలిస్తుండగా.. అటువైపు ఉన్న అభిమాని బాలకృష్ణను కలిసేందుకు వాగులో దూకేశాడు. వరద ఉద్ధృతికి అతను నీళ్లలో కొంతదూరం కొట్టుకుపోయాడు.
fan