A broken bed in a government hospital : అసలే.. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆసుపత్రికి వస్తే... అక్కడి మంచం విరిగి రోగి నడుము విరగ్గొట్టుకున్న ఘటన.. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. హిందూపురంలోని అహ్మద్‌నగర్‌కు చెందిన అల్తాఫ్ అనే బాలుడికి జ్వరం రావడంతో.. తల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత.. చిన్నపిల్లల వార్డులో మంచం కేటాయించి చికిత్స అందిస్తున్నారు. బాలుడు, అతడి తల్లి ఆ మంచంపై ఉండగా.. ఒక్కసారిగా అది విరిగి ఒక పక్కకు పడిపోయింది. దీంతో జ్వరంతో బాధపడుతున్న కుమారుడితోపాటు.. అతడి తల్లికి గాయాలయ్యాయి. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని బాధితులు వాపోతున్నారు.
అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే.. మంచం విరిగి.. - Govt negligence on hospitals
A broken bed in a government hospital: మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు.. అనారోగ్యంతో చికిత్సకు ప్రభుత్వాసుపత్రికి వచ్చిన రోగికి.. వింత పరిస్థితి ఎదురైంది. మంచంపై పడుకోబెట్టి చికిత్స చేస్తుండగా.. ఆ మంచం విరిపోయిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. ఆ రోగికి తీవ్రగాయాలవడంతో.. తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు.
![అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే.. మంచం విరిగి.. ప్రభుత్వాసుపత్రిలో విరిగిన మంచం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16980535-105-16980535-1668929322993.jpg)
ప్రభుత్వాసుపత్రిలో విరిగిన మంచం
హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో విరిగిన మంచం