Panchayat Secretary Forgery sarpanch sign: శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా తలుపుల మండలం లక్క సముద్రం పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన రాజేష్.. సర్పంచి తులసమ్మ సంతకాన్ని చేసి ఫోర్జరీ చేసి రూ.5 లక్షలు డ్రా చేసుకున్నాడు. ఈ ఘటనపై ఆగ్రహించిన గ్రామస్థులు.. డ్రా చేసిన డబ్బును రివకవరీ చేయాలని, సదరు కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కార్యదర్శి రాజేష్.. చేపల చెరువుల వేలం ద్వారా పంచాయతీకి వచ్చిన నాలుగు లక్షల 77 వేల రూపాయలు డ్రా చేసుకొని సొంతానికి వాడుకున్నారు. ఈ వ్యవహారంపై అప్పటి ఎంపీడీవో విచారణ చేసి రాజేష్‌ను సస్పెండ్ చేశారు. రాజేష్ స్థానంలో కార్యదర్శిగా భరత్‌ను నియమించారు. అయితే.. భరత్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి ఐదు నెలలు కావస్తున్నా.. పంచాయతీకి సంబంధించిన రికార్డులను అప్పగించలేదు.
సర్పంచ్ సంతకం ఫోర్జరీ.. రూ.5 లక్షలు డ్రా - lakka Samudram news
5 lakhs fraud with sarpanch sign forgery: ఓ పంచాయతీ కార్యదర్శి.. సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి రూ. 5 లక్షలు డ్రా చేసుకున్నాడు. అప్పటికే.. రూ.4 లక్షల 77 వేలు కాజేసిన కేసులో సస్పెండ్ అయిన కార్యదర్శి.. మరోసారి మోసానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సత్యసాయి జిల్లా లక్కసముద్రం పంచాయతీలో చోటు చేసుకుంది.

సస్పెండ్ అయిన కార్యదర్శి రాజేష్ వద్దనే రికార్డులు ఉండటం అనుమానాలకు తావిస్తోంది. దీన్ని అవకాశంగా మలుచుకున్న రాజేష్, మండల పరిషత్ సిబ్బందితో కలసి లక్క సముద్రం పంచాయతీ సర్పంచ్ తులసమ్మ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. చెక్కుపై సీలు వేసి ఐదు లక్షల రూపాయలను డ్రా చేసుకొని స్వాహా చేశారు. ఈ ఘటనపై ఇప్పటికైనా ఉన్నతాధికారుల స్పందించి పంచాయతీ నిధులు కాజేసిన రాజేష్, అతడికి సహకరించిన మండల పరిషత్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. డ్రా చేసిన డబ్బును రివకవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: