ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాదంపప్పు అనుకుని విషపుకాయలు తిని.. 15 మంది చిన్నారులకు అస్వస్థత

FOOD POISON IN SATYASAI : పండుగపూట సత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పండగ సెలవులో ఒకచోట చేరిన పిల్లలంతా అప్పటివరకు సరదాగా ఆడుకున్నారు. ఇంతలోనే ఏవో కాయలు కనిపించడంతో బాదంపప్పు అనుకుని తినేశారు. అనంతరం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే తల్లిదండ్రులు పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

FOOD POISON IN SATYASAI
FOOD POISON IN SATYASAI

By

Published : Aug 31, 2022, 9:26 PM IST

ILLNESS FOR CHILDRENS : విషపు కాయలు తిని 15 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన సత్యసాయి జిల్లాలో జరిగింది. హిందూపురం మండలం సుబ్బిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 20మంది చిన్నారులు పండుగ రోజు కావడంతో ఓ చోట చేరి ఆడుకుంటూ విషపు కాయలు (ఎర్ర ఆముదం) తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన చిన్నారుల తల్లిదండ్రులు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. ప్రాణాపాయం లేదని కాకపోతే విషపు కాయలు తినడం వల్ల వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ప్రాణాపాయం లేదని తెలపడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details