అగ్ని ప్రమాద బాధితుడికి 'యువకేర్' ఆసరా - help poor
అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన వ్యక్తికి అండగా నిలబడ్డారు ఓ లెక్చరర్. తన పిల్లల పుట్టిన రోజు వేడుకకు వినియోగించే నగదుతో... అగ్ని ప్రమాద బాధితుడికి ఆసరా అందించారు.
అగ్ని ప్రమాద బాధితుడికి యువకేర్ ఆసరా
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అక్కలరెడ్డి పల్లెలోని అగ్ని ప్రమాద బాధితుడు భాస్కర్‌కు ఆసరాగా నిలిచారు యువకేర్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు అబ్రహం. ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన భాస్కర్‌కు సాయం చేశారు. పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ అబ్రహం... తన పిల్లల పుట్టిన రోజు సందర్భంగా... భాస్కర్‌కు నిత్యావసర సరుకులు, వంటపాత్రలు అందజేశారు.