ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిశ కమిటీ భేటీలో వైకాపా ఎంపీ మాగుంట ఆగ్రహం

MP Magunta Srinivasulu Reddy: ప్రకాశం జిల్లాలో ప్రొటోకాల్ అమలుపై కలెక్టర్ దృష్టిపెట్టాలన్నారు వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. సమాచారం ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని అసంతృప్తిని వ్యక్తం చేశారు. దిశ కమిటీలో మాట్లాడిన ఆయన.. పరిస్థితి ఇలాగే ఉంటే లోక్​సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు.

protocol
protocol

By

Published : Jan 11, 2022, 9:00 PM IST

MP Magunta Srinivasulu Reddy: కేంద్రం అమలు చేసే పథకాల విషయంలో అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని ప్రకాశం జిల్లా దిశ కమిటీ ఛైర్మన్ , ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. దిశ(జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ) సమావేశంలో.. స్థానిక ప్రజాప్రతినిధులు పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా మాట్లాడిన దిశ ఛైర్మన్, ఎంపీ మాగుంట.. అర్హులైన పేదలందరికీ పథకాలు అందాలని సూచించారు. కీలక సమావేశానికి అధికారులు సమగ్ర సమాచారంతో రావాలని సూచిచారు. సభ్యులు చర్చించిన అంశాలపై సత్వరమే జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నప్పుడే కమిటీ ఉద్దేశ్యం నేరవేరుతుందని అన్నారు.

ఎంపీ మాగుంట ఆగ్రహం..

ప్రోటోకాల్ విషయంపై ఎంపీ మాగుంట ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారంలో ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రొటోకాల్ అమలుపై కలెక్టర్ దృష్టిపెట్టాలని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే లోక్​సభ స్పీకర్​కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుందన్నారు.

ఇదీ చదవండి

RGV On Movie Tickets: టికెట్ల అంశంపై వర్మ వరుస ట్వీట్లు.. ఏపీ సర్కార్​పై ప్రశ్నల వర్షం

ABOUT THE AUTHOR

...view details