YSRCP MLA Anna Rambabu: ప్రకాశం జిల్లా గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యే అన్నా రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైకాపా నేత సుబ్బారావు గుప్తాపై దాడి ఘటనను ఖండించిన ఆయన.. సుబ్బారావు ఇతర సామాజిక వర్గమైతే సుభానీ కొట్టేవారా? అని ప్రశ్నించారు. గిద్దలూరు రాజకీయ పరిస్థితులపై సీఎంను కలిసి వివరిస్తానని అన్నారు. సీఎంను కలిసిన తర్వాత సంచలన నిర్ణయం తీసుకుంటా అని వ్యాఖ్యనించారు. సొంత పార్టీ వారిని ప్రశ్నిస్తూ.. ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేసిన వ్యాఖ్యలు ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారాయి.
గప్తా ఏమన్నారంటే..?
ఈ నెల 12న బాలినేని పుట్టినరోజు వేడుకల్లో.. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్‌లపై సుబ్బారావు గుప్తా వ్యాఖ్యలు చేశారు. వారి వ్యవహార శైలితో పార్టీకి తీరని నష్టం జరుగుతోందని అన్నారు. దీంతో ఆయనకు సొంత పార్టీలోని పలువురి నుంచి బెదిరింపులు అధికమయ్యాయి. ఈ క్రమంలోనే ఒంగోలు లంబాడీడొంకలోని ఆయన నివాసంపై ఈనెల 18న రాత్రి కొందరు యువకులు దాడి చేశారు. దీంతో సుబ్బారావు గుప్తా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.