ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జాతీయ రహదారిపై విద్యుత్​ దీపాల ఏర్పాటుకు పరిశీలన - వైకాపా నాయకులు పాలేటి రామారావు తాజా వార్తలు

ప్రకాశం జిల్లా చీరాల పరిధిలో జాతీయ రహదారుల్లోని కూడళ్లలో వీధి దీపాల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. 219వ జాతీయ రహదారిని చీరాల విద్యుత్​ ఏడీఈతో కలిసి పరిశీలించారు. వైకాపా నేత, మాజీ మంత్రి పాలేటి రామారావు పరిశీలించారు.

ysrcp leaders visit street light fixing
జాతీయ రహదారిపై విద్యుత్​ దీపాలు ఏర్పాటుకు పరిశీలన

By

Published : Jun 7, 2020, 5:21 PM IST

చీరాల నియోజకవర్గ పరిధిలో ఉన్న 219 జాతీయ రహదారిపై ప్రతి జంక్షన్ వద్ద విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయమై.. వైకాపా నాయకుడు పాలేటి రామారావు, వరికూటి అమృతపాణి... చీరాల విద్యుత్ ఏడీఈ శ్రీమన్నారాయణతో కలిసి తోటవారి పాలెం నుంచి చల్లా రెడ్డిపాలెం వరకు ఉన్న అన్ని కూడళ్లు పరిశీలించారు.

రాత్రిళ్ళు కూడళ్లలో వీధి దీపాలు లేకపోవడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామస్థుల అభ్యర్ధన మేరకు అధికారులతో కలిసి పరిశీలించినట్లు తెలిపారు. చీరాల మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, మించాలా సాంబశివరావు, చుండూరి వాసులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details