ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రుద్రభూమిపై వాలిన వైసీపీ గద్దలు.. ఆందోళనలో గ్రామస్థులు - markapuram news

YSRCP leaders Land grabbing in ap: వైసీపీ నేతల భూదాహానికి అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కొట్టాలపల్లిలో శ్మశానవాటికపై అక్రమార్కుల కన్నుపడింది. దళితులు, బీసీలు వినియోగించుకునేందుకు వీలుగా 2 ఎకరాల భూమిని శ్మశానం కింద అప్పట్లో అధికారులు కేటాయించారు. ధరలు బాగా పెరగడంతో భూమికి గిరాకీ వచ్చింది. ఇదే అదనుగా అక్రమార్కులు రెచ్చిపోయారు. భూమి పట్టా ఉన్నా.. అక్కడ మృతదేహాలు ఖననం చేస్తే కేసులు పెడతామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.

YSRCP  leaders
YSRCP leaders

By

Published : Feb 7, 2023, 5:13 PM IST

కొట్టాలపల్లిలో శ్మశానవాటికపై అక్రమార్కుల కన్ను

YSRCP leaders Land grabbing: గుడి, బడి, శ్మశానం.. కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లుగా మారింది వైసీపీ ప్రభుత్వంలోని ఆ పార్టీకి చెందిన నాయకుల తీరు. వారిని ప్రశ్నించే వారు ఉండరని అనుకున్నారో.. లేదా తమ ప్రభుత్వమే కదా అనుకున్నారో కానీ.. వైసీపీ నేతల కన్ను శ్మశానంపై పడింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఆక్రమించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు శ్మశానంలోకి వెళ్లందుకు ప్రయత్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో చోటు చేసుకుంది.

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం సమీపంలోని వేములకొట పంచాయతిలోని కొట్టాలపల్లికి చెందిన దళితులు, బీసీలు వినియోగించుకునే శ్మశానానికి చెందిన భూమిపై వైసీపీ నాయకుల కన్నుపడింది. సర్వే నంబర్ 414/1 లో 14.48 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమి ఉంది. అందులో 2 ఎకరాల భూమిని శ్మశానం కింద అప్పట్లో అధికారులు కేటాయించారు.

విలువైన భూమి కావడంతో గ్రామానికి చెందిన జంకే వెంకట నారాయణరెడ్డి, చాగంటి వెంకట నారాయణరెడ్డి అనే వైసీపీ నాయకుల కన్ను పడింది. భూమి పట్టా తమ పేరుపై ఉందని ఆనేతలు ఆరోపిస్తున్నారని గ్రామస్థులు వెల్లడించారు. మృతదేహాలను ఆ భూమిలో ఖననం చేస్తే కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నాడని గ్రామస్థులు వాపోతున్నారు. ఎప్పటినుంచో తాము వినియోగించుకుంటూ వస్తున్న శ్మశానాన్ని ఆక్రమించడంపై వేములకొట పంచాయతీలోని కొట్టాలపల్లి వాసులంతా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ పూర్వీకుల సమాధులు ఉన్న రుద్రభూమిని అక్రమార్కుల చెర నుంచి విడిపించాలని ప్రభుత్వాధికారులను గ్రామస్థులు కోరుతున్నారు.

'ఈ శ్మశానం మా తాత ముత్తాతల నుంచి ఉంది. వారిని ఇక్కడే ఖననం చేసేవారు. ఇక్కడే శ్మశానాన్ని ఉపయోగించుకున్నాం. అయితే... ఇప్పుడు వైసీపీకి చెందిన నేతలు మీకు శ్మశానం లేదని అంటున్నారు. ఇది వాగు కింద ఉన్న పోరంబోకు భూమీ ఇక్కడ మాకు ప్రభుత్వాధికారులు కేటాయించారు. ఇప్పడు వాళ్లు మా భూమిని ఆక్రమించుకోవడమే కాకుండా.. ఇప్పుడు మాకు కేటాయించిన ఈ శ్మశానంలోకి మమ్మల్ని రానివ్వడం లేదు. ప్రభుత్వానికి ఇదే విషయం మీద సమాచారం ఇచ్చాం. సర్వేయర్ వచ్చి రెండు సార్లు సర్వే చేశారు. అయినా వైసీపీ నాయకులు ఈ భూమిలోకి రావద్దంటున్నారు. వస్తే మాపై కేసులు పెడతాం అని మమ్మల్ని బెదిరిస్తున్నారు.'- కొట్టాలపల్లి గ్రామస్థులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details