Attack on YSRCP leader subbarao Gupta:మంత్రి బాలినేని అనుచరుల చేతిలో దాడికి గురైన వైకాపా నేత సుబ్బారావు గుప్తాను అదే పార్టీకి చెందిన పలువురు నేతలు పరామర్శించారు. ఆర్య వైశ్య కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ కుప్పం ప్రసాద్, ఆర్య వైశ్య రాష్ట్ర మహా సభ అధ్యక్షుడు ద్వారకనాథ్తో పాటు మరికొందరు వైకాపా నేతలు గుప్తా ఇంటికి వచ్చి ధైర్యంగా ఉండాలని చెప్పారు. జరిగిన ఘటన బాధకరమని.., సుబ్బారావు కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని కోరారు. పార్టీ పరంగా, ఆర్యవైశ్య సంఘాల పరంగా ఆయనకు అండగా నిలుస్తామన్నారు.
ప్రాణహాని ఉంది..రక్షణ కల్పించాలి: సుబ్బారావు
మంత్రి బాలినేనిని గత రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి కలిశామని సుబ్బారావు ఉన్నారు. తనపై జరిగిన దాడి ఘటనపై మంత్రి విచారం వ్యక్తం చేశారన్నారు. తనకు ప్రాణహాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని సుబ్బారావు కోరారు.
ఏం జరిగిందంటే...
ఈ నెల 12న బాలినేని పుట్టినరోజు వేడుకల్లో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్‌లపై సుబ్బారావు గుప్తా వ్యాఖ్యలు చేసారు. వారి వ్యవహార శైలితో పార్టీకి తీరని నష్టం జరుగుతోందని అన్నారు. దీంతో ఆయనకు సొంత పార్టీలోని పలువురి నుంచి బెదిరింపులు అధికమయ్యాయి. ఒంగోలు లంబాడీడొంకలోని ఆయన నివాసంపై శనివారం రాత్రి కొందరు యువకులు దాడి చేశారు. దీంతో సుబ్బారావు గుప్తా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే సోమవారం సుబ్బారావు గుప్తాకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గుంటూరులోని ఓ లాడ్జిలో తలదాచుకుంటున్న గుప్తాపై మంత్రి బాలినేని అనుచరులు దాడికి పాల్పడ్డారు. ‘మోకాళ్ల మీద కూర్చో.. దండం పెట్టు..వాసన్నకు (మంత్రి బాలినేని) క్షమాపణ చెప్పు.. రెండు నిమిషాల్లో నరికేస్తాం.. నిన్ను..’ అంటూ గుప్తాను విచక్షణారహితంగా కొట్టడం తీవ్ర సంచలనం కలిగించింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా సంబంధిత వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది.
బాలినేని ఏమన్నారంటే..