ప్రకాశం జిల్లా అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా జాతీయ జెండాను ఎగురవేయాల్సి ఉంది. కానీ వైకాపా అద్దంకి ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య ఆ పని చేశారు. నియోజకవర్గమంతా ఆ అంశం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాను ఎగుర వేయాల్సి ఉండగా.. అద్దంకిలో ఈ విధంగా జరగడం చూస్తుంటే అద్దంకి రూటే సపరేటు అని స్థానికులు చర్చించుకుంటున్నారు.
మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన వైకాపా నాయకుడు
గణతంత్ర దినోత్సవం రోజున ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండా ఎగరవేస్తారు. కానీ ప్రకాశం జిల్లా అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో వైకాపా నాయకుడు జాతీయ జెండా ఎగరవేశారు. అది కూడా సంబంధిత అధికారి సంమక్షంలో జరగడం కొసమెరుపు.
మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన వైకాపా నాయకుడు