ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైకోర్టు ఆగ్రహించినా... మళ్లీ రంగులు వేశారు..! - ప్రకాశం జిల్లా పామిడిపాడులో వైకాపా రంగులు

ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయవద్దని హైకోర్టు స్పష్టం చేసినా... కొన్ని గ్రామాల్లో నాయకులు వైకాపా రంగులు వేస్తూనే ఉన్నారు. నిన్నటివరకు గ్రామ సచివాలయాలకే పరిమితమైన ఈ రంగుల వ్యవహారం... ఇప్పుడు ఆరోగ్య కేంద్రాలకు పాకింది. ప్రకాశం జిల్లా కొరిశాపాడు మండలం పామిడిపాడు గ్రామంలో ఆరోగ్య ఉపకేంద్రానికి వైకాపా రంగులు వేశారు. ఈ విషయాన్ని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సాయంత్రానికే పార్టీ రంగులను తొలగించారు.

ysrcp colors on  the health sub-center of the village of Korisapadu Mandalam Pamidipadu of Prakasam district
ఆరోగ్య  ఉపకేంద్రానికి వైకాపా రంగులు

By

Published : Jan 29, 2020, 6:07 PM IST

హైకోర్టు ఆగ్రహించినా... మళ్లీ రంగులు వేశారు

..

ABOUT THE AUTHOR

...view details