నాలుగు ఎకరాల పొలం, ఇల్లుని అధికార పార్టీ నాయకుడు ఆక్రమించాడని.. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం మండాదివారిపల్లెకి చెందిన కొండయ్య దంపతులు.. జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఆస్తిని మొత్తం తన పేరుపై రాయాలని ఒత్తిడి చేస్తూ భయపెట్టడంతో.. భయపడి కనిగిరిలో తలదాచుకుంటున్నామని వాపోయారు. పొలం, ఇల్లు రాసి ఇవ్వకున్నా.. తనదేనంటూ ముళ్లకంప వేశారని.. ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేంటని ప్రశ్నించినందకు తనపై దాడికి పాల్పడ్డారని.. కొండయ్య కుమారుడు చిరంజీవి ఆరోపించారు.
అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం.. ఇల్లు, పొలం ఆక్రమించిన వైనం
తమ పొలం, ఇల్లును వైకాపా నాయకులు ఆక్రమించాడని.. ప్రకాశం జిల్లా మండాదివారిపల్లెకి చెందిన కొండయ్య దంపతులు.. జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఆస్తిని మొత్తం తన పేరుపై రాయాలని ఒత్తిడి చేస్తూ భయపెడుతున్నారని వాపోయారు.
అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం.. ఇల్లు, పొలం ఆక్రమించిన వైనం