ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్​ ఉచిత వ్యవసాయ విద్యుత్​ పథకం గోడపత్రిక ఆవిష్కరణ - పర్చూరు తాజా వార్తలు

వ్యవసాయ మార్కెట్​ ఆవరణలో వైఎస్సార్​ ఉచిత వ్యవసాయ విద్యుత్​ పథకం గోడపత్రికను వైకాపా నియోజవర్గ బాధ్యుడు రామనాథం బాబు ఆవిష్కరించారు.

ysr free current scheme wall poster released
గోడపత్రిక ఆవిష్కరించిన వైకాపా నియోజకవర్గ బాధ్యుడు రామనాధం బాబు

By

Published : Oct 11, 2020, 5:09 PM IST

పర్చూరు వ్యవసాయ మార్కెట్​ ఆవరణలో వైఎస్సార్​ ఉచిత వ్యవసాయ విద్యుత్​ పథకం గోడ పత్రికను వైకాపా నియోజకవర్గ బాధ్యుడు రామనాథం బాబు ఆవిష్కరించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వటమే సీఎం జగన్​మోహన్​ రెడ్డి ఉద్దేశ్యమని ఆయన అన్నారు.

పొలాలకు మీటర్లు బిగించడం వల్ల ఏ ప్రాంతాల్లో ఎంత విద్యుత్​ అవసరమవుతుందో తెలుస్తుందని... నాణ్యమైన విద్యుత్​ రైతులకు అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్​ డీఈ రామకృష్ణ, అద్దంకి, పర్చూరు ఏడీలు, ఏఈలు, రైతులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details