వరకట్న వేధింపులను తట్టుకోలేక ఓ మహిళ పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించిన ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో చోటు చేసుకుంది. పట్టణంలోని బాదుల్లా వారి వీధిలో నివాసముంటున్న షేక్ హుస్సేన్‌కు అదే వీధికి చెందిన షాపిన్కు 2019 నవంబర్‌లో వివాహం జరిగింది. ఆ సమయంలో కట్నంగా హుస్సేన్‌కు రూ.50 వేల నగదు, ఉంగరం, మరికొన్ని వస్తువులను తమ కుటుంబ సభ్యులు ఇచ్చారని బాధితురాలు వెల్లడించింది. సంసారం కొద్ది రోజులపాటు సజావుగానే సాగిందని... తాజాగా అదనపు కట్నం తీసుకురావాలంటూ హుస్సేన్, అతని కుటుంబ సభ్యులు తరచూ వేధిస్తున్నారని షాపిన్ ఆవేదన వ్యక్తం చేసింది. పలుమార్లు శారీరకంగా, మానసికంగా తనను హింసించారని ఆరోపించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆరోపిస్తూ షాపిన్ సోమవారం పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించింది. యువతికి కనిగిరి ఐద్వా నాయకులు మద్దతుగా నిలిచారు.
న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ ఎదుట యువతి నిరసన
అదనపు కట్నం కోసం ఆ యువతికి అత్తగారింట్లో వేధింపులు ఎదురయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ పరిస్థితులతో తీవ్ర ఆవేదన గురైన బాధితురాలు... తనకు న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ ఎదుట నిరసనకు దిగింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగింది.
Young woman protest in front of police station
కనిగిరి ఎస్సై రామి రెడ్డి భాదితురాలిని పిలిపించి మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆ యువతి ఇంటికి వెళ్లిపోయింది.