ఓ వ్యక్తిని కత్తితో బెదిరించి చోరీకి పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం వీవర్స్ కాలనీలో ఎచ్చెర్ల స్వామిదాస్ నివసిస్తున్నారు. నాదెండ్ల విజయ్ అనే యువకుడు ఆయన ఇంటికి వెళ్లి రాయితో గాయపరిచాడు. కత్తితో బెదిరించి 5వేల నగదు, చరవాణి, ద్విచక్రవాహనం దొంగిలించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈపూరుపాలెం పోలీసులు విజయ్ను అదుపులోకి తీసుకున్నారు.
కత్తితో బెదిరించి చోరీకి పాల్పడిన యువకుడు అరెస్ట్ - ప్రకాశం జిల్లా చీరాల మండలంలో దొంగ అరెస్టు
ఆ యువకుడు చదివేది హోటల్ మేనేజ్మెంట్. చెడువ్యసనాలకు అలవాటు పడ్డాడు. చేతిలో డబ్బు లేకపోవడంతో ఓ ఇంటి యజమానిని కత్తితో బెదిరించాడు. నగదు, చరవాణి, ద్విచక్రవాహనాలను తీసుకుని పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో ఊచలు లెక్కపెడుతున్నాడు. వ్యసనాలు మితిమీరితే జరిగే పరిణామాలేమిటో తెలిపే ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో జరిగింది.
కత్తితో బెదిరించి చోరీకి పాల్పడిన యువకుడు అరెస్ట్
నిందితుడి నుంచి దాడికి ఉపయోగించిన కత్తిని, రూ. 75 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. చోరీకి పాల్పడిన యువకుడు హైదరాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాడని సి.ఐ రోశయ్య తెలిపారు. చెడువ్యసనాలకు అలవాటు పడి అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడని వివరించారు.
ఇదీ చదవండి: పిల్లలను జాగ్రత్తగా బడికి పంపించే బాధ్యత తల్లిదండ్రులదే: మంత్రి సురేశ్