ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బయ్యవరానికి చెందిన మాలేపాటి శ్రీకాంత్ (28) గురువారం గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని ముట్టకుంట వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన అమ్మాయిని తల్లిదండ్రుల ఆమోదంతో పెళ్లి చేసుకున్నాడు శ్రీకాంత్. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో భార్య, కుమారుడు ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యంతో చనిపోయారు. రెండేళ్లుగా వారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఓ కిరాణా దుకాణంలో గుమస్తాగా పని చేస్తున్న శ్రీకాంత్ ఆదివారం తల్లిదండ్రుల వద్దకు వెళ్లొచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుని మృతిపై అనుమానాలు లేవని.. ఒంటరితనంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రకాష్‌రావు తెలిపారు.
ఒంటరితనంతో యువకుడి ఆత్మహత్య - రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య తాజా వార్తలు
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి ఆనంద జీవితానికి ప్రతీకగా ఓ కుమారుడు. చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ హాయిగా బతుకుతున్న వారి జీవితాలను విధి చిన్న చూపు చూసింది. అనారోగ్య రూపంలో మృత్యవు.. భార్య, కుమారుడిని దూరం చేసింది. ఒంటరితనం కుంగదీసింది. ఇక ఈ లోకంలో ఉండలేనని రైలు కింద పడి.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వినుకొండలో రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య