ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మాస్క్ ధరించలేదని... అపస్మారకస్థితికి చేరేలా కొట్టారు' - ప్రకాశం జిల్లా నేర వార్తలు

మాస్క్ ధరించనందుకు పోలీసులు కొట్టటంతో తమ కుమారుడు అపస్మారకస్థితికి చేరుకున్నాడని ఓ వ్యక్తి ఆరోపించాడు. అయితే ఘటనపై పోలీసుల వాదన మరోలా ఉంది. తమ నుంచి అతను తప్పించుకోవడానికి ప్రయత్నించాడని... ఈ క్రమంలోనే గాయపడ్డాడని చెబుతున్నారు.

young man severely beaten up by police
young man severely beaten up by police

By

Published : Jul 20, 2020, 9:59 AM IST

మాస్క్ పెట్టుకోనందుకు పోలీసులు కొట్టటంతో తమ కుమారుడు అపస్మారకస్థితికి చేరుకున్నాడని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట పరిధిలో ఈ ఘటన జరిగింది.

భాదితుడి తండ్రి మోహన్ రావు తెలిపిన వివరాల ప్రకారం... చీరాల థామస్​పేటకు చెందిన వై.కిరణ్ కుమార్, వి.షైని అబ్రహం ద్విచక్రవాహనంపై కొత్తపేటకు వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరారు. కొత్తపేట పంచాయితీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద పోలీసు సిబ్బంది వీరిని ఆపి మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే కిరణ్ కుమార్ తలపై ఎస్​ఐ కొట్టటంతో తీవ్రగాయమై అపస్మారకస్దితికి చేరుకున్నాడు. వెంటనే బాధితుడిని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్లారు.

బాధితుడు కిరణ్ కుమార్

ఘటనపై పోలీసుల స్పందన మరోలా ఉంది. మద్యం మత్తులో బైక్​పై వస్తున్న కిరణ్​కుమార్, షైనీని తమ సిబ్బంది ఆపటంతో వాగ్వివాదానికి దిగారని చీరాల రెండో పట్టణ ఎస్​ఐ విజయకుమార్ చెప్పారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా తనపైనా దురుసుగా వ్యవహరించారని వెల్లడించారు. వారిని జీపులో పోలీసు స్టేషన్​కు తరలిస్తుండగా మార్గమధ్యంలో కిరణ్ కుమార్ వాహనం నుంచి దూకేశాడని పేర్కొన్నారు. ఈ క్రమంలో అతని తల రహదారికి తగిలి గాయమైందని ఎస్​ఐ విజయకుమార్ వివరించారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదు

ABOUT THE AUTHOR

...view details