ఈత కోసం క్వారీ గుంతలో దిగిన బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెంలో జరిగింది. ప్రకాశం ముండ్లమూరు మండలం, ఉల్లగల్లుకు చెందిన గద్దె రాజశేఖర్ (17).. బోయపాలెం సమీపంలో నిర్మాణంలో ఉన్న గురుకుల పాఠశాలలో.. తాపీ మేస్త్రీగా పని చేస్తున్న తన మామయ్య మండలపాటి ఏసోబు వద్దకు ఇటీవల పనులకు వచ్చాడు. ఆదివారం రాజశేఖర్‌తో తోటి కార్మికుల పిల్లలు కత్తి చందు, జ్యోతి అశోక్‌తో కలసి పాఠశాల వెనుక వైపు ఉన్న క్వారీలో ఈతకు దిగారు. వారిలో రాజశేఖర్ గల్లంతయ్యాడు. పిల్లలు వెంటనే తల్లిదండ్రుల వద్దకు వెళ్లి విషయం చెప్పారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సాయంతో క్వారీ గుంతను గాలించి మృతదేహాన్ని వెలికితీశారు.
ఈత సరదా ప్రాణం తీసింది - క్వారీ గుంతలో పడి బాలుడు మృతి
ఈత కొడదామని గుంతలోకి దిగిన యువకుడు ప్రమాదవశాత్తూ మునిగి మృతి చెందాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా బోయపాలెంలో జరిగింది.
క్వారీ గుంతలో పడి యువకుడు మృతి