ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకడంతో చికిత్స నిమిత్తం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా.. అనారోగ్యానికి గురయ్యాడు. పరీక్షించిన వైద్యులు బాధితుడికి బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకినట్లు నిర్ధరించారు.
ప్రకాశం జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ మరణం
ప్రకాశం జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ మరణం నమోదైంది. చీరాల మండలంలోని పేరాలకు చెందిన ఓ వ్యక్తి ఈ వ్యాధి కారణంగా హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ప్రకాశం జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ మరణం
దీంతో మెరుగైన వైద్యం కోసం బాధితుడిని హైదరాబాద్‌కు తరలించారు. శస్త్ర చికిత్స చేసి దవడను తొలగించిన వైద్యులు.. వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత విషమించి సోమవారం ఉదయం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటికి ఆసరాగా ఉన్న కొడుకును కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని మృతుడి తల్లి కన్నీటిపర్యంతమయ్యారు.
ఇవీచదవండి.