ఎస్సై విచక్షణారహితంగా కొట్టటంతో యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో జరిగింది. మాస్క్ ధరించకుండా బయటకు వచ్చాడన్న కారణంగానే తమ కుమారుడ్ని ఎస్సై కొట్టాడని మృతుడి తండ్రి ఆరోపించాడు. ఆ ఎస్సైపై కఠిన చర్యులు తీసుకోవాలని భాదిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
అసలేం జరిగింది
చీరాలకు చెందిన వై.కిరణ్ కుమార్... మరో యువకుడితో కలిసి ద్విచక్రవాహనంపై కొత్తపేటకు వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరారు. కొత్తపేట పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద పోలీసు సిబ్బంది వీరిని ఆపి మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఎస్సై విజయకుమార్... కిరణ్ మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఎస్సై దాడి చేయగా... కిరణ్ తలకి బలమైన గాయం అయ్యింది అని బాధిత కుటుంబసభ్యులు చెప్పారు.