ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దర్శి బ్రాంచ్​ సాగర్ కాలువలో జారిపడి యువకుడు మృతి - darsi sagar canal latest news

ప్రకాశంజిల్లా దర్శి బ్రాంచి సాగర్ కాలువలో జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పొలం పనులు ముగించుకుని తిరిగి వెళ్లేప్పుడు కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు నీటిలోకి దిగిన సమయంలో ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగింది.

searching for young man
యువకుడి కోసం వెతుకుతున్న సహాయక సిబ్బంది

By

Published : Oct 19, 2020, 1:13 PM IST

ప్రకాశంజిల్లా దర్శిపట్టణంలోని స్థానిక కురిచేందు రోడ్డులో గల సాగర్ కాలువలో జారిపడి యువకుడు మరణించాడు. పొలం పనులు ముగించుకుని కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుందామని వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం:

దర్శి మండలం తూర్పు వీరాయపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన కోటికల వీరవెంకట కోటేశ్వరరావు(18) వ్యవసాయ కూలీ పనులు చేస్తుంటాడు. ఆదివారం పొలం పనులు పూర్తి చేసుకుని తిరిగి వెళ్లే క్రమంలో కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుందామని పక్కనే ఉన్న సాగర్ ప్రధాన కాలువలోకి దిగాడు. పొరపాటున కాలుజారటంతో నీటిలో పడి గల్లంతయ్యాడు. అతనితో పాటు వెళ్లిన కూలీలు, బంధువులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారి సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై రామకోటయ్య తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details