ప్రకాశం జిల్లా సంతమాగులూరులో యువకుడి మృతదేహం లభ్యమైంది. అద్దంకి బ్రాంచి కాలువ అడవిపాలెం పవర్ ప్లాంట్ లాకుల వద్ద.. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది.. మృతదేహం గుంటూరు జిల్లా వినుకొండ గ్రామీణ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన లక్ష్మయ్యదిగా గుర్తించారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అడవిపాలెం పవర్ ప్లాంట్ వద్ద ... యువకుడి మృతదేహం.. - young man dead body in Adavipalem power plant in Prakasam District
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం అడవిపాలెం పవర్ ప్లాంట్ వద్ద.. యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడు గుంటూరు జిల్లా వినుకొండ గ్రామీణ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన లక్ష్మయ్యగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అడవిపాలెం పవర్ ప్లాంట్ వద్ద ... యువకుడి మృతదేహం లభ్యం