Young Man Committed Suicide Duo To Police Harrasement :ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పోలీసుల వేధింపుల వలన ఆత్మహయత్నానికి పాల్పడిన దళిత యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నెల 6 తేదీన యర్రగొండపాలెంలో పోలీసులు కొట్టారని మనస్థాపానికి గురైన మోజేష్ పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రగాయాలైన యువకున్ని పోలీసులే మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు.
తాను ఏ తప్పు చేయకపోయినా పోలీసులు తనను తీవ్రంగా కొట్టడంతో పాటు తన తండ్రిని దర్బాషలాడారని బాధిత యువకుడే ఆరోపించాడు. ఎస్సై, సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు కారణమని వెల్లడించాడు. మోజేష మృతి చెందిన నేపథ్యంలో దళిత సంఘాలు, కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించే అవకాశం ఉండడంతో, పోలీసులు ముందస్తుగానే యర్రగొండపాలెంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
గోదావరిలో దూకి యువకుడు ఆత్మహత్య.. పోలీసుల వేధింపులే కారణమని లేఖ
Teacher Suicide Attempt Due To School Management Harassment :ఓ ప్రైవేటు స్కూలు ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోట చేసుకుంది. యాజమాన్యం వేధింపులే కారణమంటూ బాధితుడు, కొంత మంది ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పెదవేగి మండలం వేగివాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తడికలపూడికి చెందిన కొత్తపల్లి రత్తయ్య ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. ఈయనను కొంతకాలం కిందట స్కూలు యాజమాన్యం తొలగించింది. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన రత్తయ్య ఈ నెల 10న రాత్రి తడికలపూడిలో పురుగుల మందు తాగారు. తీవ్ర అస్వస్థతకు గురైన రత్తయ్యను కుటుంబ సభ్యులు ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతున్నారు.