పలు ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలను దొంగతనం చేసిన కేసులో నిందితుడిని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.11లక్షలు విలువచేసే 25 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
బైక్ చోరీలకు పాల్పడుతున్న యువకుడు అరెస్టు.. వాళ్లే అతని టార్గెట్ - prakasam district updates
ప్రకాశం జిల్లాలో ద్విచక్రవాహనాలను దొంగతనం చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 25 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రులకు వచ్చిన వారిని గమనించి.. వారి బైక్లను దొంగతనం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
బైకులు
కంబం గ్రామానికి చెందిన ఖనీ అనే యువకుడు ఆసుపత్రులకు వచ్చిన వారిని గమనించి.. వారి ద్విచక్రవాహనాలను దొంగతనం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. గుంటూరు, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఇలాంటి దొంగతనాలకు పాల్పుడుతున్న విషయంలో బాధితులు ఒంగోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఒంగోలులో నిందితుడు పట్టుబడినట్లు ఎస్పీ మలిక్ గార్గ్ తెలిపారు.
ఇదీ చదవండి