వివాహం చేసుకుంటే చదువుకు అంతరాయం కలుగుతుందేమోనని ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎరువారిపల్లి గ్రామంలో వీరంరెడ్డి లక్ష్మి ప్రసన్న(19)... మార్కాపురంలో ఏ వన్ గ్లోబల్ కాలేజీలో బీ టెక్ ఇంజనీరింగ్ చదువుతోంది ఈ మధ్యే తన తల్లిదండ్రులు తనకు వివాహ ఏర్పాట్లు చేస్తున్నారు. వివాహం చేసుకుంటే తన చదువుకు అంతరాయం కలుగుతుందేమోనని... తీవ్ర మనస్థాపానికి గురైన విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై కనిగిరి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
వివాహమైతే చదవు ఆగుతుందేమోనన్న మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య - ఎరువారిపల్లిలో ఆత్మహత్య తాజా వార్తలు
వివాహం చేసుకుంటే చదువుకు అంతరాయం కలుగుతుందేమోనని ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎరువారిపల్లి గ్రామంలో జరిగింది.
ఎరువారిపల్లిలో విద్యార్థిని ఆత్మహత్య