ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగన్ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారు' - ycp one year celebrations

ఏడాది పాలనలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90శాతం అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేశ్‌ వ్యాఖ్యానించారు. వైకాపా పాలనకు ఏడాది పూర్తియిన సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.

'జగన్ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారు'
'జగన్ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారు'

By

Published : May 30, 2020, 5:59 PM IST

వైకాపా పాలనకు ఏడాది పూర్తియిన సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లా వైకాపా కార్యాలయంలో రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేశ్‌, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకరబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళలు అర్పించారు.

ఏడాది పాలనలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90శాతం అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారని మంత్రులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details