ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని వైకాపాలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. మొదటి నుంచి ఎంపీపీ పదవి ఆశించి దక్కని వారు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు రాజీనామాకు సిద్ధమయ్యారు. మార్కాపురం మండలం ఎంపీపీ పదవిని మొదటి నుంచి తిప్పాయిపాలెం ఎంపీటీసీ బండి లక్ష్మీదేవి ఆశించారు. అయితే అనూహ్యంగా చోటుచేసుకున్న పరిణామాలతో నాయుడుపల్లి ఎంపీటీసీ పోరెడ్డి అరుణకు దక్కింది. దీంతో తిప్పాయిపాలెం ఎంపీటీసీ ప్రమాణస్వీకారానికి హాజరుకాలేదు.
YCP MPTC : వైకాపాలో వర్గ విభేదాలు.. మునగపాడు ఎంపీటీసీ రాజీనామా - YCP MPTCs in Markapuram constituency
ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని వైకాపాలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. మొదటి నుంచి ఎంపీపీ పదవి ఆశించి దక్కని వారు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తే.. మరికొందరు రాజీనామాకు సిద్ధమయ్యారు.

మునగపాడు ఎంపీటీసీ రాజీనామా
ఇక గోగులదిన్నే ఎంపీటీసీ కొన్ని కారణాల వల్ల ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదని తెలిపారు. తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు - 1 ఎంపీటీసీ రావి రత్నమ్మ ఎంపీపీ పదవి దక్కలేదన్న కారణంతో ప్రమాణస్వీకారానికి గైర్హాజరయ్యారు. కేతగుడిపి ఎంపిటిసి శారోన్ కూడా హాజరుకాలేదు. కొనకనమిట్ల మండలం మునగపాడు ఎంపీటీసీ మెట్టు వెంకటరెడ్డి ఎంపీపీ పదవి దక్కలేదన్న అసంతృప్తితో కొన్ని కారణాల వలన ఎంపీటీసీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇదీ చదవండి : conflict : 'ఆ పదవి మాకు కావాలి... కాదు మాకే కావాలి'