ప్రకాశం జిల్లాలో పోలీసుల దాడిలో గాయపడి మృతి చెందిన ఎస్సీ యువకుడు కిరణ్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. కిరణ్ కుటుంబానికి అన్ని విధాలా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు విచారణను పారదర్శకంగా చేపట్టాలని పోలీసులకు సీఎం జగన్ సైతం ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.
కిరణ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి - ప్రకాశం జిల్లాలో దళితుడు కిరణ్ మృతి
ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసుల దాడిలో గాయపడి మృతి చెందిన కిరణ్ కుటుంబాన్ని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మాల కార్పొరేషన్ ఛైర్మన్ అమ్మాజీలు పరామర్శించారు. ఘటనపై పారదర్శకంగా విచారణ జరుగుతోందని...బాధిత కుటుంబానికి తప్పక న్యాయం జరుగుతుందన్నారు.
ycp mla sridevi