ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్ వినూత్న రీతిలో పేదలకు సహాయం అందించేందుకు ముందుకు వచ్చాడు. ఒక్క ఫోన్ చేస్తే భోజనం ఉచితంగా ఇంటికే పంపిస్తామని తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో పేదలు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసినట్లు వివరించారు. 9966874444 నెంబరుకు ఫోన్ చేస్తే ఆహారం లేదా వారానికి సరిపడా బియ్యం, నిత్యావసరాలు అందిస్తామని కరణం వెంకటేశ్ యూత్ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. బుధవారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. ఫోన్ చేసిన వారికి సహాయం అందించేందుకు 20 మంది యువకులు ఇందులో పాల్గొంటున్నారని అన్నారు. ఈ అవకాశం అంతా వినియోగించుకోవాలని కోరారు.
ఒక్క ఫోన్ చేయండి.. సహాయం పొందండి.. - mla karanam balaram son help people with phone no in prakasam
లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు సహాయం అందించేందుకు దాతలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వినూత్న రీతిలో పేదలకు సహాయం అందేలా ఏర్పాట్లు చేశారు. ఒక్క ఫోన్ చేస్తే ఇంటికే ఆహారం లేదా నిత్యావవసరాలు అందేలా చర్యలు తీసుకున్నారు.
ఒక్క ఫోన్ చేయండి.. సహాయం పొందండి..