తెదేపా ప్రభుత్వ హయాంలోనే బంజరు భూములన్నీ స్వాహా చేశారని వైకాపా నేత, మాజీ ఎంపీపీ దుగ్గెంపూడి వెంకటరెడ్డి ఆరోపించారు. తెదేపా కార్యక్తరల భూములు తాము లాక్కున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనన్నారు. ప్రకాశం జిల్లా దేవరాజుగట్టులో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. తెదేపా కార్యకర్తలపై దౌర్జన్యానికి పాల్పడి తాము భూములు లాక్కున్నామని నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని అన్నారు.
'భూములు లాక్కున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే' - ycp latest news
తెదేపా కార్యకర్తలపై దౌర్జన్యానికి పాల్పడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని ప్రకాశం పెద్దారవీడు మండలం వైకాపా నేత, మాజీ ఎంపీపీ దుగ్గెంపూడి వెంకటరెడ్డి అన్నారు. మేము ఎవరి భూములు లాక్కోలేదని... తెదేపా హయాంలోనే బంజర భూములు స్వాహా చేశారని ఆరోపించారు.
భూములు లాక్కున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమే
తమ్మడపల్లికి చెందిన గంగరాజు అనే తెదేపా కార్యకర్త తమ కార్యకర్తలపైనే దాడి చేసి గాయపరిచాడని పేర్కొన్నారు. గంగరాజు తమను బెదిరించేందుకే తనకు తానే రాయితో కొట్టుకున్నారని... అతన్ని పరామర్శించేందుకు తెదేపా జిల్లా నాయకులంతా రావడం విడ్డూరంగా ఉందన్నారు. నుకసాని బాలాజీ విసిరిన సవాళ్లకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం జగన్ సారధ్యంలో నీతి నిజాయితీగా పాలన సాగిస్తున్నామన్నారు.
ఇవీ చదవండి..