YCP LEADER SUBBARAO GUPTA PROTEST : మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు తనపై దాడి చేసి సంవత్సరం పూర్తైన దోషులుపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని వైసీపీ నేత సుబ్బారావు గుప్తా ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. దోషులు బాలినేని చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు సందర్భంగా తాను ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తిని అయినా , తనకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. ధర్నాకు ఫ్లెక్సీ పెట్టుకొని కూర్చునేందుకు సుబ్బారావు గుప్తా ప్రయత్నించగా పోలీస్ ఫ్లెక్సీని పెట్టనివ్వలేదు. దాంతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
నాపై దాడికి ఏడాది పూర్తి.. దోషులకు శిక్ష ఎప్పుడు : వైసీపీ నేత సుబ్బారావు గుప్తా - కలెక్టరేట్ వద్ద వైసీపీ నేత సుబ్బారావు నిరసన
YCP LEADER SUBBARAO GUPTA PROTEST: తనపై దాడి జరిగి సంవత్సరం పూర్తైన దోషులపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని వైసీపీ నేత సుబ్బారావు గుప్తా ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఆందోళన చేపట్టాడు.
YCP LEADER SUBBARAO GUPTA PROTEST