YCP Dissident Leaders Meeting in Markapuram :రానున్న ఎన్నికల్లో గెలుపు ఎజెండాగా అధికార పార్టీ సాధికార బస్సు యాత్ర (YSRCP Sadhikara Bus Yatra) పేరుతో ప్రజల్లోకి వెళ్లింది. కానీ ప్రజాక్షేత్రంలో కనీస స్పందన లేకపోవడంతో ఖాళీ కుర్చీలకు వారి ప్రసంగాలకు వినిపిస్తూ బస్సు యాత్రను బలవంతంగా ముందుకు లాగుతున్నారు. ఈ తరుణంలో సాధికార బస్సు యాత్రలకు అధికార పార్టీకి సంబంధించిన కీలక నేతలే రాకుండా అలక పాన్పు ఎక్కడంతో వైఎస్సార్సీపీ అధిష్టానానికి తలపోటుగా మారింది.
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ నేతల అసంతృప్తి - అసమ్మతి నేతల చర్చల మర్మమేంటో! Balineni Srinivasa Reddy Did Not Attend YSRCP Sadhikara Bus Yatra : వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సాధికార బస్సు యాత్ర ప్రకాశం జిల్లాలోని ఆ పార్టీ వర్గాల్లో చిచ్చురేపింది. మార్కాపురంలో మంగళవారం నిర్వహించిన యాత్రకు హాజరైన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి.. కనిగిరిలో బుధవారంనాటి యాత్రకు దూరమయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి, ఆయనతో పాటు మరికొందరు కీలక నేతల సైతం దూరంగా ఉన్నారు.
వైసీపీలో అసమ్మతి మంటలు.. సీటు కోసం నువ్వా-నేనా
Balineni Srinivasa Reddy Dissident with Vijayasai Reddy Comments :మార్కాపురం సాధికార బస్సు యాత్రకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి కలిసి ఒకే కారులో వెళ్లారు. శామ్యూల్ జార్జి కళాశాల (Samuel George College) ఆవరణలో నిర్వహించిన సమావేశంలో.. వచ్చే ఎన్నికల్లో సిటింగ్ ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి (MLA Kunduru Nagarjuna Reddy) పోటీ చేస్తారని, ఆయనను ఆశీర్వదించాలని.. మళ్లీ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డినే గెలిపించుకోవాలని పార్టీ ఆంతరంగికులను విజయసాయిరెడ్డి కోరారు. రోజంతా కలిసే ఉన్నా తమకు చెప్పకుండా ఏకపక్షంగా నాగార్జునరెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంపై బాలినేని, మరికొందరు నాయకులు చిన్నబుచ్చుకున్నారు. బుధవారం కనిగిరి సభకు వెళ్లే ముందు ఎంపీ విజయసాయి రెడ్డి.. బాలినేని ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో బాలినేని తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Vijayasai Reddy Comments on Markapuram MLA Ticket to Kunduru Nagarjuna Reddy :ఒంగోలులో ఇటీవల నిర్వహించిన సమీక్షల్లో జిల్లాపై పెత్తనం తనకు ఇస్తానని చెప్పారని, ఇప్పుడు ఏమీ చెప్పకుండా అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం ఏంటని విజయసాయి రెడ్డిని బాలినేని ప్రశ్నించినట్లు సమాచారం. తాను కనిగిరి బస్సుయాత్రకు రానని, మీ పని మీరు చూసుకుంటే ఒంగోలులో తన పనేదో తాను చేసుకుంటానని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. తాను కేవలం ఒంగోలుకే పరిమితమవుతానని.. ఇతర ప్రాంతాలతో తనకు అవసరం లేదని ఖరాఖండిగా చెప్పినట్లు అధికార పార్టీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. మార్కాపురం టికెట్ ఆశిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి వర్గం సైతం కనిగిరి పర్యటనకు దూరంగా ఉన్నారు.
YSRCP Leaders Bike Rally Against MLA Chandra Prasad: "ఈ ఎమ్మెల్యే వద్దు.. జగన్ ముద్దు" అంటూ చంద్రప్రసాద్‌కు వ్యతిరేకంగా వైసీపీ నేతల బైక్ ర్యాలీ
Janke Venkata Reddy Dissident with Vijayasai Reddy Comments : విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి సైతం అసంతృప్తి చెందారు. ఈ తరుణంలో మార్కాపురంలోని జంకె వెంకటరెడ్డి నివాసంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి అసమ్మతి నేతల సమావేశం అయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై నాయకులతో మార్కాపురంలోని ఆయన నివాసంలో జంకే వెంకటరెడ్డి భేటీ అయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై నాయకులతో జంకె వెంకటరెడ్డి కీలక భేటీ అయినట్లు తెలుస్తోంది. మార్కాపురం నుంచి వైసీపీ టికెట్ జంకె వెంకటరెడ్డి వర్గం ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి వెన్నా హనుమారెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ పరిణామాలు ప్రస్తుతం వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి.
YSRCP Sadhikara Bus Yatra : కనిగిరిలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్రకు జనాన్ని తరలించడానికి వైసీపీ నేతలు అవస్థలు పడ్డారు. ఈ సభకు ఎవరెవరు ఎక్కడెక్కడ నుండి వచ్చారో లేదో అని కొందరు మహిళలు హాజరు తీసుకుంటూ ఉండడాన్ని పలువురు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా సభ ప్రారంభం కాగానే వైసీపీ నేతలు చెప్పే వాగ్దానాలను వినలేక సభకు వచ్చిన ప్రజలు పెద్ద సంఖ్యలో వెనుదిరిగారు.
నెల్లూరు వైఎస్సార్సీపీలో ముసలం.. ఆనం, కోటంరెడ్డి బాటలో మరొకరు..