ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రసాభాసగా చీరాల మున్సిపల్ సమావేశం.. రెండు వర్గాలుగా వీడిన వైకాపా కౌన్సిలర్లు - వైకాపాలో బయటపడ్డ వర్గ విభేదాలు

Chirala municipal meeting: చీరాల మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. వైకాపాలోని రెండు వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. 2022- 23 సంవత్సరానికి గాను బడ్జెట్​ను ప్రవేశపెట్టకుండా అధికారపార్టీలోని కొందరు కౌన్సిలర్లు అడ్డుకున్నారు. ఛైర్మన్ పోడియం ముందు భైఠాయించి బడ్జెట్​కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.

Chirala municipal meeting
Chirala municipal meeting

By

Published : Jan 28, 2022, 7:57 PM IST

Chirala municipal meeting: ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కౌన్సిల్ వేదికగా వైకాపాలోని రెండు వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. సమావేశం మధ్యలో కొత్త అజెండా ఇవ్వడంపై మున్సిపల్ ఛైర్మన్ వ్యతిరేక వర్గం ఆగ్రహం వ్యక్తంచేసింది. మొత్తం మూడు సమావేశాలు ఏర్పాటు చేయగా 2022- 23 సంవత్సరానికి గాను రూ. 18.84 కోట్లతో పాలక వర్గం బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. చిరు వ్యాపారుల కోసం రోడ్డు డివైడర్ల స్థానంలో షెడ్లు ఏర్పాటుచేసేందుకు బడ్జెట్​లో నిధులు కేటాయించడాన్ని అధికారపార్టీలోని కొందరు కౌన్సిలర్లు తీవ్రంగా తప్పుబట్టారు.

ఛైర్మన్ తీరును నిరసిస్తూ కౌన్సిల్‌ హాల్‌లో బైఠాయించారు. నిరసనల మధ్య సమావేశం ముగిసిందని ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావు సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో కమిషనర్ మల్లేశ్వరరావుకి 11మంది కౌన్సిలర్లు డీసెంట్ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details