పంచాయతీ కార్యాలయానికి వైకాపా రంగు తొలగింపు - పంచాయతీ కార్యాలయానికి వైకాపా పార్టీ రంగు తొలగింపు !
ప్రకాశం జిల్లా దర్శి నగరపంచాయతీ కార్యాలయానికి వైకాపా రంగులు తొలగించారు. వాటి స్థానంలో అధికారులు తెలుపురంగును వేయించారు.

పంచాయతీ కార్యాలయానికి వైకాపా పార్టీ రంగు తొలగింపు
ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు మార్చాలన్న హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాయ్యస్థానం ఆదేశాలకు అనుగుణంగా కార్యాలయాలకు వైకాపా రంగులు తొలగిస్తున్నారు. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ కార్యాలయానికి రంగులు మార్చి అధికారులు తెలుపు రంగును వేయించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యపట్ల అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.